అందరూ పండక్కి పలకరించారు, మరి అల్లరోడేక్కడ?

Published on Oct 9, 2019 3:00 am IST

మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న అల్లరి నరేష్ అనతికాలంలోనే అర్థ సెంచరీకి పైగా చిత్రాలు చేశాడు. ఐతే గత కొంత కాలంగా ఆయన చిత్రాలు అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో చిత్రాలు చేయడం తగ్గించారు. ఇటీవల మహేష్ హీరోగా వచ్చిన మహర్షి చిత్రంలో ప్రాధాన్యం ఉన్న సెకండ్ హీరో రోల్ చేశారు. కాగా ఆయన తాజాగా బంగారాబుల్లోడు అనే చిత్రాన్ని చేస్తున్నారు.

దర్శకుడు పివి గిరి డైరెక్షన్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల కావడంతో పాటు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. కాగా దసరా సందర్భంగా అటు స్టార్ హీరోలనుండి చిన్నా చితక హీరోలవరకు తమ మూవీలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. కానీ అల్లరి నరేష్ కనీసం ఎవరికీ పండగ శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. నిజానికి ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల చేయాల్సివుండగా ఇంత వరకు ఎటువంటి ప్రచారం లేకపోవడం గమనార్హం.

నరేష్ కి జంటగా పూజా ఝవేరి నటిస్తుండగా, పోసాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, పృథ్వి రాజ్ ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీ కి సంగీతం సాయి కార్తీక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More