ఇంటర్వ్యూ : హీరోయిన్ నూరిన్ – అప్పుడు ‘అల్లు అర్జున్’ను పెళ్లాడాలనిపించింది !

Published on Feb 27, 2019 7:15 pm IST

ఒమర్ లులు దర్శకత్వంలో సోషల్ మీడియా సెన్సేషన్ హీరోయిన్ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ అండ్ నూరిన్ షరీఫ్ – రోషన్ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘లవర్స్ డే’. షాన్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మంచి అంచనాలు మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

అయితే ఈ చిత్రంలో ‘ప్రియా ప్రకాష్ వారియర్’తో పాటు మరో హీరోయిన్ గా నటించిన నూరిన్ షరీఫ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరిలానే అల్లు అర్జున్ అంటే తనకూ బాగా ఇష్టమని, తను కూడా బన్నికి పెద్ద ఫ్యాన్ అని.. లవర్స్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్నీ రావడంతో తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ఓ సందర్భంలో ఆయన్ను పెళ్లాడాలనిపించిందని చెప్పుకొచ్చింది నూరిన్ షరీఫ్.

నూరిన్ షరీఫ్ ఇంకా మాట్లాడుతూ… ‘లవర్స్ డే’కి ఫస్ట్ హీరోయిన్ తానేనని.. అయితే అనుకోకుండా సోషల్ మీడియాలో ప్రియాకు క్రేజ్ రావడం వల్ల ఆమెను సినిమాలో మరో మెయిన్ లీడ్ గా మార్చాల్సి వచ్చిందని, దాంతో సినిమా స్క్రిప్ట్ మారిందని… బహుశా అదే సినిమా నెగిటివ్ రిజల్ట్ కి కారణం అయి ఉంటుందని ఆమె తెలిపింది.

నూరిన్ ఇంకా మాట్లాడుతూ.. అసలు ప్రియా ప్రకాష్ కు మెయిన్ లీడ్ ఇవ్వడానికి, దర్శక నిర్మాతల పై ఆమె ఒత్తిడి కూడా బాగా ఉంది. దాంతో నా రోల్ కి ఇంపార్టెన్స్ కొంతమేరకు తగ్గింది. అయితే క్లైమాక్స్ లో మాత్రం తన పాత్రకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక హీరో రోషన్ తో మళ్లీ మరో సినిమా చెయ్యాలని ఉందని చెప్పుకొచ్చింది నూరిన్.

సంబంధిత సమాచారం :