మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘డ్రాగన్’. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా ఇది కాగా దీనిపై హైప్ ఆకాశాన్ని అంటింది. ఇక నేడు ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యారు.
అయితే ఈ సినిమా గ్లింప్స్ రాక ముందు వరకు అంతా ఈ సినిమాకి ప్రభాస్ సలార్ కి లింక్ ఉండొచ్చు అని చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ చూసిన తర్వాత సలార్ తో కాదు ఇదేదో కేజీయఫ్ తో లింక్ అయ్యి ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది.
డ్రాగన్ సినిమా తాలూకా టైం లైన్ అలాగే కేజీయఫ్ సినిమాల టైం లైన్ లు దాదాపు దగ్గరదగ్గరగా ఉన్నాయి. సో ప్రశాంత్ నీల్ సలార్ తో ప్లాన్ చేసాడు అనుకుంటే తాను మరో ప్లాన్ లో ఉన్నాడని అనిపిస్తుంది. సో ఈ క్రాసోవర్ ఎంతవరకు సాధ్యం అనేది కాలమే నిర్ణయించాలి.


