నోటా ట్రైలర్ విడుదల తేదీ ఖరారు !

Published on Sep 3, 2018 4:27 pm IST

‘గీత గోవిందం’చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న మరో చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ‘ఇరుముగన్ ‘ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న’ నోటా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్. తెలుగు ,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క ట్రైలర్ సెప్టెంబర్ 6న సాయంత్రం 4గంటలకు విడుదల కానుంది.

మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకం ఫై నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ప్రముఖ నటులు సత్య రాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి .

సంబంధిత సమాచారం :