“వీరమల్లు” సెట్స్ లో గాయపడ్డ ప్రముఖ నటుడు.!

Published on Mar 31, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. ఇప్పుడు శరవేగంగా షూట్ ను జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటిస్తున్న ఓ ప్రముఖ నటుడు గాయాల పాలైన వార్త కాస్త ఆందోళనకు గురి చేసింది. ఆ నటుడు మరెవరో కాదు పవన్ తో లాస్ట్ సినిమా “అజ్ఞ్యాతవాసి”లో కూడా నటించిన ఆదిత్య మీనన్.

మరి వీరమల్లులో గుర్రపు స్వారీ చేస్తున్న ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా అతనికి తీవ్ర గాయాలు అయ్యినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే యశోద హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం అతన్ని తరలించగా అక్కడ నుంచి చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆదిత్య మీనన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. మరి తాను త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :