ప్రముఖ నటుడు ‘వేదం’ నాగయ్య కన్నుమూత.!

Published on Mar 27, 2021 2:48 pm IST

విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటి వరకు తీసిన ప్రతీ సినిమా కూడా విజయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోయేలా నిలిచింది. అలా తాను చేసిన చిత్రాల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్ అనుష్క లతో కలిపి ‘వేదం’ అనే డిఫరెంట్ ఎమోషనల సినిమాను తీశారు కానీ అది అప్పట్లో కమర్షియల్ గా విజయం అందుకోకపోయిన అందులో కనిపించిన ప్రతీ ఒక్క నటి నటుడు తమ బెస్ట్ ను ఇచ్చారు.

అలా ఆ చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం అయినా నటుడు నాగయ్య. ఆ సినిమాలో చిన్నపాటి రోల్ లో కనిపించినా తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుతంగా నటించారు. ” కట్టేటోడికి ఇల్లు ఉంటుందా సెప్పు కుట్టేటోడికి సెప్పు ఉంటుందా” అన్న ఎమోషనల్ డైలాగ్స్ పలికించిన ఈ నటుడికి మంచి బ్రేక్ ను ఇచ్చాయి.

అనేక ఆర్ధిక ఇబ్బందులతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగయ్య ఆనతి కాలంలోనే పలు చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ తో “స్పైడర్”లో కూడా నటించిన ఈయన ఈరోజే అనారోగ్యంతో కన్ను మూసినట్టుగా తెలిసింది. దీనితో ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు వారి ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేసారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు టీం తరపున కూడా కోరుకుంటున్నాం.

సంబంధిత సమాచారం :