స్టార్స్ అంతా దుబాయ్ లో సెటిల్ అవుతున్నారు ఎందుకో?

Published on Sep 25, 2020 11:17 am IST

ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యుత్తమ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన దుబాయ్ పైనే అందరి దృష్టి ఇపుడు పడుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్చులు కూడా అక్కడే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక దీనితో పాటుగా మన దేశానికీ చెందిన పలువురు అగ్ర తారలు అంతా అక్కడే పూర్తి స్థాయిలో సెటిల్ అయ్యిపోవాలని ఫిక్స్ అయ్యిపోతున్నారు ఎందుకో.

ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సెలెబ్రెటీలు కుమార్ సను, దలేర్ మెహందీ, సోను నిగమ్ సహా చాలా మందే దుబాయ్ లోకి షిఫ్ట్ అయ్యిపోయారు. ఇపుడు వీరి బాటలోనే మన దక్షిణాదికి చెందిన ఒక స్టార్ నటుడు కూడా దుబాయ్ లో పర్మనెంట్ గా ఉండిపోవాలని ఫిక్స్ అయ్యిపోయారట.

ఆ నటుడు మరెవరో కాదు మాధవనే..అతను అక్కడ పలాజో వెరాస్క్ లో 5 స్టార్ రెసిడెన్సీ లోని ఒక ప్రాపెర్టీని కొన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మాధవన్ కూడా అక్కడికి షిఫ్ట్ కానున్నారు. మరి ఇలా మన దేశపు సినీ తారలు అంతా అక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో అన్నదానికి ఇంకా సమాధానం దొరకలేదు.

సంబంధిత సమాచారం :

More