‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్?

‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్?

Published on Oct 24, 2015 10:00 PM IST

bhale-bhale-mogadivoye
‘భలే భలే మగాడివోయ్’.. నాని హీరోగా, చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి రూపొందించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. తెలుగులో ఓ మిడిల్ లెవెల్ బడ్జెట్ సినిమాగా వచ్చిన భలే భలే మగాడివోయ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా ఏ సెంటర్స్, అమెరికాలో ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించి హీరో నానికి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది.

‘భలే భలే మగాడివోయ్’ సినిమాకున్న యూనివర్సల్ అప్పీల్ నేపథ్యంలో ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు పలు పెద్ద సంస్థలు సైతం ఆసక్తి కనబరిచారు. ఇక తాజాగా భలే భలే మగాడివోయ్ తమిళ రీమేక్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలో సంగీత దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకొని, ప్రస్తుతం హీరోగానూ మెప్పిస్తోన్న జీవి ప్రకాష్ హీరోగా భలే భలే మగాడివోయ్ రీమేక్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఓ సరికొత్త కాన్సెప్ట్, మంచి కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజా వార్తలు