ప్రముఖ నిర్మాత చేతికి కల్కి థియేట్రికల్ రైట్స్ !

Published on Apr 30, 2019 2:44 pm IST

‘గరుడ వేగ’ తో చాలా రోజల తరువాత హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘అవె’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తుది దశ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్నాడట ప్రముఖ నిర్మాత , సత్య సాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్. ఇక అలాగే ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులకు కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మూడు బడా ఛానెళ్లు ఈ హక్కులకోసం పోటీ పడుతున్నాయి.

ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై అంచనాలను పెంచింది. వాస్తవిక సంఘటనల ఆదరంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత శ్వేతా , ఆదా శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :