కిరణ్ అబ్బవరం సినిమాలో ఒక్క సాంగ్ కి భారీ ఖర్చు.!

Published on Jun 1, 2022 11:00 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాణ సంస్థలలో తమ ఫస్ట్ సినిమా నుంచే మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతున్న ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకరి. ప్రస్తుతం అయితే పలు భారీ పాన్ ఇండియా సినిమాలు అలాగే మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలతో కూడా బిజీగా ఈ ప్రొడక్షన్ హౌస్ వారు ఉన్నారు.

అయితే వీరు మరియు మరో నిర్మాణ సంస్థ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ తో టాలీవుడ్ హ్యాపెనింగ్ యంగ్ హీరో అయినటువంటి కిరణ్ అబ్బవరం నూతన దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం గాను ఏకంగా 1 కోటి రూపాయలు ఖర్చు చేసి భారీ సెట్టింగ్స్ నడుమ ఆ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట.

మరి ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కోలీవుడ్ యంగ్ హీరోయిన్ అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ గ్రాండ్ సాంగ్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :