స్టార్ రైటర్ కి మాతృ వియోగం !

Published on Apr 2, 2020 7:48 pm IST

‘బొమ్మరిల్లు, క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి సూపర్ హిట్ చిత్రాల రైటర్‌ అబ్బూరి రవికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి లలిత (73) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు పై బడటం కారణంగా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆమెకు బుధవారం గుండెపోటు వచ్చింది.

గురువారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గల మహాప్రస్థానంలో లలితగారి అంత్యక్రియలు జరిగాయి. లలితగారికి నలుగురు కుమారులు కాగా అబ్బూరి రవి చిన్న కుమారుడు. ఈ సంఘటనతో అబ్బూరి రవి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

123తెలుగు.కామ్ తరఫున లలితగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :

X
More