ఈసారి అదిరిపోయే టీంతో వస్తున్న శర్వానంద్.!

Published on Nov 24, 2020 12:01 pm IST

మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు శర్వానంద్ “మహాసముద్రం”, అలాగే “శ్రీకారం” అనే బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒక పక్క ఇవి లైన్ లో ఉండగానే మరో అదిరిపోయే టీం తో ప్లాన్ చేసిన చిత్రాన్ని కంప్లీట్ చేసేసారు.. ఇపుడు తన 30వ సినిమాగా మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ను లేటెస్ట్ గా కంప్లీట్ చేసేసినట్టు మేకర్స్ తెలిపారు.

నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ తో కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ నిర్మాణ సంస్థ అయినటువంటి “డ్రీం వారియర్ పిక్చర్స్” వారు నిర్మించనున్నారు. వీరి నుంచి వచ్చిన “ఖైదీ” సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో మనం చూసాము.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాలు అందించిన టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తుండగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లు కూడా నటిస్తున్నారు. అలాగే అక్కినేని అమల కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తుండడం గమనార్హం. మరి మొత్తానికి మాత్రం ఈసారి శర్వా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ తోనే వస్తున్నాడు. ఫ్యామిలీ అండ్ యూత్ కు ఒక ట్రీట్ లా ఉండే ఈ చిత్రాన్ని థియేట్రికల్ విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More