వారికి కూడా అందుబాటులోకి వచ్చిన “వకీల్ సాబ్”.!

Published on May 6, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం గత నెల భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సాలిడ్ కం బ్యాక్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్న సమయంలోనే కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కూడా పెరిగిపోతుండడంతో దిగ్గాజ స్ట్రీమింగ్ యాప్ ప్రైమ్ వీడియోలో తొందరగానే స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేసారు.

అయితే ఈ చిత్రం కేవలం ఇండియన్ వీక్షకులకు మాత్రమే అందుబాటులోకి రాగా వారు స్ట్రీమ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఓవర్సీస్ ఆడియెన్స్ కి మాత్రం ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో లేదట. మరి దానిని ఇప్పుడు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా ఇది వాసరికి ఎక్స్ క్లూజివ్ వెర్షన్ అట. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అనన్య నాగళ్ళ, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :