మాస్ సాంగ్ తో బిజీగా ఉన్న బన్నీ!


వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతోన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నా పేరు సూర్య సినిమా పనులు దాదాపు ఎండింగ్ కు వచ్చేశాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మిగిలిన పనులను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ కష్టపడుతోంది.

సాధారణంగా బన్నీ సినిమాల్లో ఎదో ఒక సాంగ్ హైలెట్ గా ఉండడం కామన్. ముఖ్యంగా మాస్ సాంగ్ పై అయితే ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. కాబట్టి చిత్ర యూనిట్ కూడా అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా సాంగ్ ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ లో మాస్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మరియు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సాంగ్ లో వేసే స్టెప్పులు మాస్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఇక మే 4న సినిమా రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.