2022 సంక్రాంతికి ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ?

Published on Aug 8, 2020 7:22 am IST

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 2021లో డబుల్ ధమాకా ఇద్దాం అనుకున్నారు. ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ తో ప్రకటించిన తన 30వ చిత్ర షూటింగ్స్ లో ఏకకాలం పూర్తి చేయాలనేది ఆయన ఆలోచన. ఏప్రిల్ నుండి త్రివిక్రమ్ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఐతే కరోనా వైరస్ వ్యాప్తి, దానివలన ఏర్పడిన లాక్ డౌన్ ఎన్టీఆర్ ప్రణాళిలను తారుమారు చేశాయి. దీనితో ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి అయిన తరువాతే అని తెలుస్తుంది.

మిగిలిన 30శాతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి చాలా సమయం పట్టేలా ఉంది. దీనితో ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ 2021 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్ర టార్గెట్ 2022 సంక్రాంతి అని తెలుస్తుంది. కాబట్టి 2021 లో ఎన్టీఆర్ నుండి రెండు చిత్రాలు వస్తాయని ఆశిస్తున్న ఫ్యాన్స్ కి ఆశాభంగం తప్పేలా లేదు.

సంబంధిత సమాచారం :

More