ఎన్టీఆర్ : ఎన్‌కౌంటర్‌.. న్యాయం జరిగింది

Published on Dec 6, 2019 11:29 am IST

గత నెల 27న వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయగా నలుగురునీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై సామాన్య జనం హర్షం వ్యక్తం చేస్తుండగా సినీ ప్రముఖులు సైతం సంతృప్తి తెలుపుతున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ న్యాయం జరిగింది. దిశ ఇప్పుడు విశ్రాంతి తీసుకో అంటూ తన అభిప్రాయాన్ని, పోలీసులపై చర్యపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఇతర సెలబ్రిటీలు సైతం ఈ ఘటన పట్ల సానుకూలంగానే మాట్లాడుతున్నారు.

సంబంధిత సమాచారం :

More