ఎన్టీఆర్, బన్నీ మధ్య పోరు తప్పదేమో..?

Published on Apr 5, 2020 3:00 am IST

ఎన్టీఆర్, బన్నీలు వచ్చే ఏడాది వేసవికి ఒకేసారి దిగే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ 2021 సమ్మర్ లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రాగా, మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మూవీ ప్రకటన రోజే 2021 ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా విడుదల చేస్తామంటూ చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్టీఆర్ 2021 సమ్మర్ లో తన చిత్రాన్ని విడుదల చేయనున్నాడు.

కాగా బన్నీ, సుకుమార్ తో మూవీ చేస్తుండగా దీన్ని కూడా వారు 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజానికి 2021 చివర్లో ఈ చిత్రం విడుదల చేయాలని సుకుమార్ భావించాడు. ఐతే కరోనా వైరస్ కారణంగా మూవీ షెడ్యూల్ వాయిదా పడింది. దీనితో మరో నెల వరకు కూడా ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కాబట్టి నిదానంగా సినిమా కంప్లీట్ చేసి సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఇదే కనుక జరిగితే 2021లో ఎన్టీఆర్, బన్నీ పోటీ పడడం ఖాయం అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More