ఎన్టీఆర్, చరణ్ లుక్స్ లో డిఫరెన్స్ అదే..!

Published on Mar 26, 2020 7:22 am IST

రాజమౌళి ఉగాది కానుకగా నిన్న ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లో ఉన్న ఆ మూడు అక్షరాల అర్థం చెప్పేశారు. కొంచెం ఊహకు దగ్గరగా మరి కొంచెం ఊహించని విధంగా టైటిల్ రౌద్రం రణం రుధిరం అని నిర్ణయించారు. మోషన్ పోస్టర్ రాజమౌళి సినిమా రేంజ్ లో రిచ్ అండ్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా హీరో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. టైటిల్ మొదటి పదంలో రౌద్రం లో చరణ్ ని చూపించిన రాజమౌళి మరో పదం రుధిరం లో ఎన్టీఆర్ ని పరిచయం చేశారు.

ఐతే వీరి లుక్స్ విషయంలో రాజమౌళి హిస్టరీ ఫాలో కాలేదని అర్థం అవుతుంది. ముఖ్యంగా చరణ్ లుక్ చూస్తే చరిత్రలో అల్లూరి సీతారామరాజు కి అసలు సంబంధం లేకుండా ఉంది. ఆయనను అప్పటి ట్రెండీ స్టైలిష్ అవుట్ ఫిట్ మరియు షూ ధరించి ఉన్నట్లు చూపించారు. ఇక రామ రాజుకు మల్లే చరణ్ కి గడ్డం కూడా లేదు. చరణ్ లుక్ తో పోల్చుకుంటే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ పంచెకట్టు, పైజామాలో కొంచెం దగ్గరగా ఉంది. రాజమౌళి సినిమా ప్రకటన సమయంలోనే చరిత్రకు ఫిక్షన్ జోడించి తీశాం అని చెప్పిన నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఎలా తీర్చిదిద్దారో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More