ఆచార్య పై క్లారిటీ రావడంతో ఎన్టీఆర్ సినిమా పై క్లారిటీ వచ్చింది !

Published on Dec 20, 2021 5:48 pm IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ పై ఒక రూమర్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందట. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ అవుతుంది. ఇక కొరటాల కూడా ఫిబ్రవరి రెండో వారం నుంచి పూర్తిగా ఎన్టీఆర్ సినిమా మీదకు రానున్నాడు. మొత్తానికి ఆచార్య రిలీజ్ పై క్లారిటీ రావడంతో, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పై కూడా క్లారిటీ వచ్చినట్లు అయింది.

కాగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ వేశామని ఆ మధ్య దర్శకుడు కొరటాల తెలిపిన సంగతి తెలిసిందే. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే ఆ సెట్ ను నిర్మించారు. ఫస్ట్ డే షూటింగ్ ఆ సెట్ లోనే స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :