వైరల్..ఎన్టీఆర్, మహేష్ ల బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కి ముహూర్తం ఫిక్స్.!

Published on Nov 30, 2021 4:04 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమాలతో పాటుగా బుల్లితెరపై కూడా సందడి చేస్తాడన్న సంగతి తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై తారక్ ఎంత పెద్ద హిట్టో స్మాల్ స్క్రీన్ పై కూడా అంతే హిట్ గా నిలిచాడు. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు తారక్ బిజీ బిజీగా హోస్ట్ చేస్తున్న లేటెస్ట్ గ్రాండ్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”.

సామాన్యులని కోటీశ్వరులుగా తీర్చి దిద్దే ఈ షో లో పలువురు సినీ తారలు కూడా పాల్గొని మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తారని తెలిసిందే. అలా ఈ షో హిస్టరీలో ప్లాన్ చేసిన సాలిడ్ ఎపిసోడ్ ఒకటి ఉంది. అదే సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసినది. ఇది అనౌన్స్ అయ్యిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే ప్రోమో వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ హైప్ ఇంకా పీక్ కి వెళ్ళింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఈ గ్రాండ్ ఎపిసోడ్ కి డేట్ మరియు టైం బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే ఆదివారం డిసెంబర్ 5న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు టెలికాస్ట్ చేయనున్నారట. ఇప్పుడు ఈ ఫొటోలే వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఎలాంటి టీఆర్పీ రికార్డ్స్ సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :