కోట చుట్టూ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ?

కోట చుట్టూ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ?

Published on Aug 2, 2020 6:50 PM IST

ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాలో ఎన్టీఆర్ ఎన్నారైగా కనిపించబోతున్నాడని, పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందని.. తనకు ఏ మాత్రం అవగాహన లేని రాజకీయ నేపథ్యంలోకి అడుగు పెట్టాల్సి వస్తోందని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదట. సినిమా పక్కా ఎంటర్ టైనర్ అని.. సినిమాలో ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ మెన్ లా కనిపిస్తాడని.. ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల చుట్టూ కథ నడుస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడట. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఫిల్మ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2021 దసరాకి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు