జూ.ఎన్టీఆర్ కు మరొక కుమారుడు !
Published on Jun 14, 2018 1:35 pm IST

జూ.ఎన్టీఆర్ ఇంటి నుండి శుభవార్త. ఆయన మరోసారి తండ్రి అయ్యారు. ఈసారి కూడ ఆయన భార్య లక్ష్మి ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఎన్టీఆర్ ‘కుటుంబం పెద్దదైంది.. మరోసారి బాబు’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ వార్తతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో సంతోషం నెలకొనగా అభిమానులు ఈ వార్తను షేర్ చేసుకుంటూ తారక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సంతోషకర సమయంలో తారక్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు 123తెలుగు టీమ్ తరఫున శుభాకాంక్షులు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook