ఎన్టీఆర్ బయోపిక్ లో మరో దర్శకుడు !
Published on Sep 27, 2018 3:58 am IST

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

కాగా ఈ చిత్రంలో ఆ కాలం లెజండరీ దర్శకుల పాత్రలను కూడా చూపించనున్నారు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం విఠలాచార్య పాత్రలో దర్శకుడు ఎన్ శంకర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట.

మరో రెండు నెలల్లో ఈ చిత్రం టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

  • 9
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook