ఎన్టీఆర్ బయోపిక్ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Oct 3, 2018 9:25 am IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, నాలుగు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా ఈ రోజు నుండి వారం రోజులపాటు దివిసీమ ప్రాంతాల్లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. తాజా సమాచారం ప్రకారం దివిసీమ ప్రాంతంలోని హంసలదీవి, కోడూరులో చిత్రబృందం షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా అప్పట్లో దివిసీమ ఉప్పెన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉప్పెనలో సర్వం కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడానికి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ విరాళాలు సేకరించారు. ఇప్పుడు దివిసీమలో ఆ దృశ్యాలనే బాలకృష్ణ, సుమంత్, రానా దగ్గుబాటిలతో పాటు ఇతర తారాగణం పై చిత్రీకరించనున్నారు.

ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :