ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న ప్రముఖ దర్శకుడు !

ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న ప్రముఖ దర్శకుడు !

Published on Nov 1, 2018 3:51 PM IST

ntr33

క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో.. ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు, కొంతమంది దర్శకులు నటిస్తున్నారు. దర్శకుడు దేవి ప్రసాద్ గుమ్మడిగా, క్రిష్ కేవీ రెడ్డిగా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు ఎన్ శంకర్ కూడా విఠలాచార్యగా కనిపించబోతున్నారని సమాచారం.

కాగా తాజాగా ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం దర్శక రత్న దాసరి నారాయణగారి పాత్రలో ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. తర్వాత జరుకాబోయే షెడ్యూల్ లో దాసరి నారాయణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనుందట చిత్రబృందం.

ఇక ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటలు అన్ని కూడా పూర్తి చేశారని.. అద్భుతంగా వచ్చాయని కీరవాణి కెరీర్ లో మరో సూపర్ హిట్ ఆల్బమ్ అని నిలుస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు

తాజా వార్తలు