శ్రీకాకుళంలో ఎన్టీఆర్ బయోపిక్ ?

శ్రీకాకుళంలో ఎన్టీఆర్ బయోపిక్ ?

Published on Oct 2, 2018 10:19 AM IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తదుపరి షెడ్యూల్ ను ఈ వారంలో ప్రారంభించనుంది. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీకాకుళంలోనే షూట్ చేయనున్నారు. తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న ‘నందమూరి కళ్యాణ్ రామ్’ కూడా శ్రీకాకుళంలో జరిగే షూట్ లో పాల్గొననున్నాడు.

కాగా దాదాపు కళ్యాణ్ రామ్ ఈ చిత్రం కోసం 20 రోజులపాటు డేట్స్ ని కేటాయించారు. అయితే ఇటీవలే హరికృష్ణగారు హఠాన్మరణం తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన పాత్రను ఇంకా పెంచాలని, సీనియర్ ఎన్టీఆర్ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు