మరో ప్రోమోతో ఆకట్టుకుంటున్న ‘కథానాయకుడు’ !

Published on Jan 3, 2019 9:08 pm IST

బాలయ్య నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు క్రిష్, బాలయ్య, సీనియర్ నరేష్, మరియు సుమంత్, కళ్యాణ్ రామ్ లకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ తాలూకు ప్రోమోని చిత్రబృందం విడుదల చేసింది.

కాగా ప్రోమోలో రానా తన పాత్ర గురించి వివరిస్తూ… నాకు చంద్రబాబునే స్వయంగా తన జీవిత విశేషాలు గురించి చెప్పారని.. దాని వల్ల ఆయన పాత్రలో నాకు నటించడం చాలా ఈజీ అయిందని రానా చెప్పుకొచ్చాడు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ బయోపిక్ లో రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను పిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More