సంక్రాంతికి విడుదలకానున్న ‘ఎన్టీఆర్’ !

సంక్రాంతికి విడుదలకానున్న ‘ఎన్టీఆర్’ !

Published on May 28, 2018 1:40 PM IST

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక దీర్ఘమైన ఆలోచన చేసిన బాలక్రిష్ణ తనతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ అయితే అన్ని విధాలా సినిమాకు న్యాయం చేయగలడని నమ్మి ఆయన్ను ఎంచుకున్నారు. ఇలా క్రిష్ సినిమాలోకి రావడంతో చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబదించి జరుగుతున్న మహానాడులో పాల్గొంటున్న బాలక్రిష్ణ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని, ఈ విడుదలలో ఎలాంటి రాజకీయపరమైన ఆలోచనలో లేవని అన్నారు. సాయి కొర్రపాటి, బాలక్రిష్ణ, విష్ణు ఇందూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు