‘ఎన్టీఆర్’ సర్ ప్రైజ్ వీడియోలో హైలైట్స్ అవే !

Published on Apr 3, 2020 2:32 pm IST

‘రౌద్రం రణం రుధిరం’లో చరణ్ పాత్ర గురించి రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉంది. అయితే సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని తారక్ ఫ్యాన్స్ తో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న తారక్ బర్త్ డే రోజున తారక్ పాత్ర మీద కూడా జక్కన్న వీడియో రిలీజ్ చేయనున్నాడు. కాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మరి రామరాజు ఫర్ భీమ్ పేరుతో రాబోయే ప్రత్యేక వీడియోలో ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేస్తారో అని ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చ నడుస్తోంది.

అయితే తాజా గాసిప్‌ ఏంటంటే ఈ వీడియోలో చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండదు అట. ఎన్టీఆర్ నే స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని.. అలాగే పులితో ఎన్టీఆర్ ఫైట్ కి సంబంధించిన విజువల్స్ ను కూడా రివీల్ చేయబోతున్నారని.. ‘ఎన్టీఆర్’ సర్ ప్రైజ్ వీడియోలో ఇవే హైలైట్స్ గా నిలివబోతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఉత్సాహపరుస్తోంది.

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ ను హైలైట్ చెయ్యటానికి రాజమౌళి క్రేజీగానే ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More