‘బాహుబలి టీం’తో పని చేయనున్న ఎన్టీఆర్, చరణ్ !

‘బాహుబలి టీం’తో పని చేయనున్న ఎన్టీఆర్, చరణ్ !

Published on Jun 7, 2018 7:35 PM IST

బాహుబలి ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విజయానికి ప్రధాన కారణం ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు. ఇప్పుడు రాజ‌మౌళి దర్శకత్వలో రాబోతున్న ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ సినిమాకి కూడా ‘బాహుబలి టీం’ నే పని చేయనుందట. ఎప్పటిలాగే రాజమౌళికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ అందించనున్నారు. కీర‌వాణి సంగీతం సమకూర్చనున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్ ను తన కెమెరాతో చిత్రీకరించిన సెంథిల్ కుమారే కెమెరా బాధ్యతలు తీసుకోనున్నారు. మాహిష్మతి సామ్రాజ్యం కోటను చూశారుగా.. రాజుల కాలంనాటి నిర్మాణాలను అపురూప శిల్పసంపదను తన దృష్టి కోణంలోంచి సృష్టించిన ఆర్ట్ దర్శకుడు ‘సాబూ సిరిల్’. ఎన్టీఆర్, చరణ్ సినిమాకి కూడా ఆయనే ఆర్ట్ దర్శకుడిగా పని చేయనున్నారు.

పోరాటాలను ఎంతో రసవక్తరంగా తీర్చిదిద్దే పీట‌ర్ హెయిన్స్ ఈ చిత్రానికి కూడా ఫైట్ మాస్ట‌ర్ గా ప‌నిచేస్తున్నారు. అన్నిటికి మించి బాహుబలి సృష్టికర్త దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ చరణ్ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ లాంటి ఒక్క స్టార్ తోనే బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన ఈ టీం, ఎన్టీఆర్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్లతో ఇంకెంతటి విజయం సాధిస్తారో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు