సింహా కోసం విచ్చేస్తున్న యంగ్ టైగర్.!

Published on Mar 17, 2021 2:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరోగా “మత్తు వదలరా” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే నటుడిగా తన మొదటి సినిమా మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళిల కాంబోలో వచ్చిన “యమ దొంగ” సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. మరి ఇప్పుడు తన రెండో సినిమా “తెల్లవారితే గురువారం” సినిమాతో రెడీగా ఉన్నాడు.

ఇక ఈ చిత్రానికి జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ చీఫ్ గెస్ట్ గా వస్తుండడం కన్ఫర్మ్ అయ్యింది. ఈ మార్చ్ 21న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తారక్ రానున్నాడు. మరి ఈ చిత్రంలో చిత్ర శుక్ల మరియు మిషా నరాంగ్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే కీరవాణి మరో తనయుడు మరియు యువ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం వచ్చే మార్చ్ 27న విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :