కొత్త ప్రోమోతో క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ !

Published on Jun 6, 2021 1:02 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ తో సెన్సేషన్ నమోదు చేశాడు. ఈ సారి “ఎవరు మీలో కోటీశ్వరులు”తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ఈ షో అనౌన్స్ చేసినప్పుడే మంచి హైప్ ను సంతరించుకుంది. అయితే ఆ తర్వాత ఈ షో పై అనేక రూమర్స్ వచ్చాయి. నిజానికి ముందు అనుకున్న డేట్ ప్రకారం ఈ ప్రోగ్రాం మే చివరివారం నుంచి ప్రసారం కావాలి.

అంతలో కరోనా సెకండ్ వేవ్ వచ్చి ఈ షో పోస్ట్ ఫోన్ అయింది. దాంతో ఈ షో ఈ ఏడాది టెలికాస్ట్‌ కాదనే పుకార్లు పుట్టించారు. సోషల్‌ మీడియాలో ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో జెమిని టీవీ యాజమాన్యం తాజాగా ఓ ప్రోమో వదిలి మొత్తానికి పుకార్లకు చెక్‌ పెట్టింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కానుందని అందరికీ క్లారిటీ ఇచ్చింది.

జెమిని టీవీ యాజమాన్యం ఈ సందర్భంగా ఒక పోస్ట్ పెడుతూ ఆట ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఈ షో చూసే వారికి కూడా వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది’ అంటూ ప్రోమోని విడుదల చేశారు.

సంబంధిత సమాచారం :