జపనీస్ డాన్సర్స్…ఎన్టీఆర్, సమీరాను దించేశారు.

Published on Jul 4, 2020 9:21 am IST

స్టార్ హీరో ఎన్టీఆర్ కి జపాన్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమాలంటే ఎగబడి చూశేవారు చాలా మంది అక్కడ ఉన్నారు. జపాన్ లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తాజా వీడియో తెలియజేసింది. ఇద్దరు జపనీస్ జంట ఎన్టీఆర్ సాంగ్ ని సేమ్ స్టెప్స్ తో దించేశారు. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో 2006 లో వచ్చిన అశోక్ సినిమాలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి జంటగా నటించారు. ఆ మూవీలోని ‘గోలా గోలా’ సాంగ్ కి ఈ జపనీస్ జంట ఎన్టీఆర్ ఎనర్జీకి సమానంగా స్టెప్స్ వేసి అలరించారు.

సదరు వీడియోని వారు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారింది. జపనీస్ జంట డాన్స్ అద్భుతంగా ఉంది. కాస్ట్యూమ్స్ తో సహా పాటను చాలా దగ్గరగా అనుకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబవుతున్నారు. ఏమైనా ఎన్టీఆర్ రేంజ్ ఏమిటో మరో మారు రుజువైంది.

సంబంధిత సమాచారం :

More