యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన ప్రతి సినిమాలోనూ ఆడియన్స్ మెప్పించడం కోసం బాగా రిస్క్ తీసుకుంటూ ఉంటాడు. దానివల్ల చాలా సార్లు గాయాల పాలయ్యాడు. ఇలా చాలా సార్లు జరిగినప్పటికీ ఎన్.టి.ఆర్ రిస్క్స్ చేయడం మాత్రం మానలేదు. ఇప్పటికీ తన సినిమాల్లో ఎంతో రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేస్తుంటాడు.
తాజాగా ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’ సినిమాలో కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ల కోసం బాగా రిస్క్ తీసుకొని చేసాడు. ఇప్పటికే ఈ సినిమాలో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయని తెలిపాం. వాటి కోసం ఎన్.టి.ఆర్ ఎంతో రిస్క్ తో కూడుకున్న డేర్ డెవిల్ స్టంట్స్ చేసారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్.టి.ఆర్ అభిమానులు థ్రిల్ అయ్యేలా ఉంటాయని సమాచారం.
ఆగష్టు 29న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతున్న ‘రభస’ సినిమా ఆగష్టు 21న సెన్సార్ కార్యక్రమాలు జరుగుకోనుంది. సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మించాడు. తమన్ అందించిన ఆడియో ఆల్బం కి మంచి రెస్పాన్స్ వస్తోంది.


