ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్ ?
Published on Feb 25, 2018 7:25 pm IST

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మర్చి మూడో వారం నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు సమాచారం. సినిమా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు వినోద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో లయ, సిమ్రాన్, మీనా నటించవచ్చని తెలుస్తోంది. త్వరలో ఒకరి పేరును ఖరారు చెయ్యబోతోంది చిత్ర యూనిట్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారికా హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా మరో హీరోయిన్ నటించబోతోందని తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

 
Like us on Facebook