చిన్నప్పుడు నన్నెవరూ అలా పిలవలేదు – ఎన్టీఆర్

Published on Sep 14, 2021 6:00 pm IST

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రతి రోజూ కూడా ఉత్కంఠగా సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో కి రోజు రోజు కి ఆదరణ పెరుగుతోంది. ఈ షో లో జూనియర్ ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను సైతం వెల్లడిస్తున్నారు.

తాజాగా ఈ షో కి వచ్చిన అంజనీ కుమార్ తో ఎన్టీఆర్ పలు విషయాలను వెల్లడించారు. మంచి పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం మంచిది అంటూ చెప్పుకొచ్చారు. అందుకే చిన్నప్పుడు తనకు కూడా ముద్దు పేరు పెట్టి ఎవరు పిలవలేదు అంటూ చెప్పుకొచ్చారు. మిమ్మల్ని కూడా అజ్జు అని అనను, అంజనీ కుమార్ గారు అనే అంటాను అని అన్నారు. జెమిని టీవీ లో ప్రసారం అవుతున్న ఈ షో కి విశేష ఆదరణ లభిస్తోంది.

సంబంధిత సమాచారం :