Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఎన్టీఆర్ !
Published on Jul 12, 2018 3:15 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బ్రాండ్ అంబాసిడర్స్ గా మారిపోతున్నారు. ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా మారబోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే సెలెక్ట్ మొబైల్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్ కు భారీ మొత్తంలోనే చెల్లించనుందట ఆ మొబైల్ కంపెనీ. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :