యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఒక బిగ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న హీరో. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్.టి.ఆర్ బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. ఎన్.టి.ఆర్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న కొన్ని విషయాలు ఎన్.టి.ఆర్ ని ఇబ్బంది పడుతున్నాయి.
టిడిపి పార్టీ తరపున ఎన్.టి.ఆర్ ప్రచారం చేయకపోవడం మరియు పవన్ కళ్యాణ్ టిడిపి తరపున ప్రచారం చేయడం వలన నందమూరి అభిమానుల్లో ఎన్.టి.ఆర్ విషయంలో కొద్దిగా విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయం గురించి తెలిసిన ఎన్.టి.ఆర్ ఈ విషయాన్ని కరెక్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.
అలాగే ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్.టి.ఆర్ కి ఒక బిగ్ హిట్ కావాలి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘రభస’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆ హిట్ అందుకుంటాడెమో చూడాలి..
