‘కథానాయకుడు’ ట్రైలర్ విడుదల ఆ రోజేనా ?

Published on Dec 9, 2018 5:21 pm IST

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. కాగా మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇప్పటికే ముఖ్యమైన పాత్రలలు సంబధించి డబ్బింగ్ కూడా చాలావరకు పూర్తి అయింది.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘కథానాయకుడు’ ట్రైలర్ డిసెంబర్ 16వ తేదీన విడుదల కావచ్చు అని తెలుస్తోంది. అయితే, ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే విడుదలైన ‘కథానాయకుడు’ నుండి ‘కథానాయక’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ కు మంచి స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ సాంగ్ కు మంచి ఆదరణ దక్కుతుంది.

కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :