యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న “రౌద్రం రణం రుధిరం” లోని కొమరం భీం లుక్ అండ్ టీజర్ చూడటం కోసం అతని అభిమానులు ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ పవర్ ఫుల్ లుక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను స్టన్ చేసే మరో లుక్ బయటకొచ్చింది.
తారక్ చేసిన ఓ యాడ్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్ బయటకు రాగా అది కాస్తా సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. అదే గడ్డంలో లుక్ లో సరికొత్త హైర్ స్టైల్ లో అలాగే స్టైలిష్ డ్రెస్సింగ్ లో కనిపించిన తారక్ కొత్త స్నాప్స్ అతని అభిమానులకు మంచి బూస్టప్ ను ఇచ్చాయి.
దీనితో భీం లుక్ ఎలా ఉండనుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ లుక్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ అక్టోబర్ 22న రివీల్ చెయ్యనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం తారక్ లైన్ లో త్రివిక్రమ్ మరియు ప్రశాంత్ నీల్ లు మరి వీరిలో ఎవరి ప్రాజెక్ట్ ను ముందు టేకప్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.


