జెర్సీ గురించి తారక్ ట్వీట్ !

Published on Apr 19, 2019 4:00 pm IST

నాని నటించిన మచ్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మంచి అంచనాలమధ్య ఈ రోజు విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను అలాగే ఎక్ట్రార్డినరీ టాక్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తెరకెక్కించిన ఈ చిత్రం లో నాని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ గౌతమ్ ,నాని లపై ప్రంశసంలు కురిపించాడు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి కథను ఎంచుకుని దాన్ని ఇంత అద్భుతంగా తెరమీదకు తీసుకువచ్చిన గౌతమ్ కు హ్యాట్సాఫ్. ఆయన విజన్ కు నటీనటుల , సాంకేతిక నిపుణల సహకారం తోడై సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లారు. నాని నీ యాక్టింగ్ బ్రిలియంట్. నాకు చాలా గర్వంగా వుందని ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :