షాకిస్తున్న కొమరం భీమ్ లేటెస్ట్ లుక్

Published on Mar 1, 2020 2:00 am IST

ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర తెరపై ఆటం బాంబ్ లా పేలనుంది. పులితో ముఖాముఖీ పోరు, నవాబు సైన్యంపై పోరాటాలు, గంభీరమైన డైలాగ్స్ తో ఆయన రెచ్చిపోనున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న నాలుగో చిత్రం ఆర్ ఆర్ ఆర్. దాదాపు 13ఏళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ తాజా లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఆయన చాలా సన్నగా కనిపిస్తున్నాడు.

ఓ యాడ్ షూట్ కొరకు ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ చాల బక్క పలుచగా కనిపించారు. యమదొంగ చిత్రానికి ముందు ఎన్టీఆర్ చాల బొద్దుగా తయారయ్యారు. యమదొంగ సినిమా కోసం ఆయన కష్టపడి చాల బరువు తగ్గారు. మళ్ళీ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం చాల సన్నగా తయారయ్యాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తుండగా జనవరి 8, 2021లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :