ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేదీ మారింది !

Published on Dec 19, 2018 2:56 pm IST

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని తెలిసిందే. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ ను జనవరి 9న విడుదలకానుంది. ఇక రెండవ భాగం ‘మహానాయకుడు’ ను జనవరి 24న విడుదలచేస్తామని ప్రకటించినా ఆ సమయానికి చిత్రం పూర్తి కాకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం. ఫిబ్రవరి 7న ఈ సెకండ్ పార్ట్ ప్రేక్షకులముందుకు రానుంది. ఇక కథానాయకుడు లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపెట్టనుండగా మహానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ కు జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా రానా , సుమంత్ , కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈచిత్రం యొక్క ఆడియో అలాగే ట్రైలర్ ను డిసెంబర్ 21న విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More