దేవాన్ష్‌ ఎన్టీఆర్ లా బాగా నటించాడట !

దేవాన్ష్‌ ఎన్టీఆర్ లా బాగా నటించాడట !

Published on Feb 15, 2019 3:28 AM IST

ఇటీవలే షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకుంది ‘మహానాయకుడు’. అయితే ఈ చిత్రానికి అలాగే నారా దేవాన్ష్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్.. తెగ హల్ చల్ చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్, ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే నిజంగానే దేవాన్ష్ ఈ సినిమాలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దేవాన్ష్‌ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారట. దేవాన్ష్‌ ఎన్టీఆర్ లా బాగా నటించాడట.

అయితే జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం మహానాయకుడు స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారు. కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. ‘మహానాయకుడు’ని తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు