స్పాట్ లోనే ఎడిటింగ్ జరుపుకుంటున్న ఎన్.టి.ఆర్ మూవీ

స్పాట్ లోనే ఎడిటింగ్ జరుపుకుంటున్న ఎన్.టి.ఆర్ మూవీ

Published on Oct 31, 2014 4:00 PM IST

ntr
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కామినేషణ్ లో వస్తున్నా సినిమా ప్రసతుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం అంతా ప్రస్తుతం గోవా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. గోవా షెడ్యూల్ లో ఎన్.టి.ఆర్ తో పాటు కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్న తరుణంలో వర్కర్స్ స్ట్రైక్ వల్ల కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది.

దాంతో ఈ చిత్ర టీం తిరిగి షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి,పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి రోజు షూట్ చేసిన పార్ట్ ని ఎప్పటికప్పుడే ఎడిటింగ్ చేసేస్తున్నారు. ఈ చిత్ర టీంతో పాటు ఈ మూవీ ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ కూడా గోవా వెళ్ళాడు. అక్కడ రోజూ షూట్ నుంచి వచ్చే ఫుటేజ్ ని ఎక్కువ భాగం అక్కడే ఎడిట్ చేసేసే పనిలో ఉన్నారు. అనుకున్న టైంని ఏ మాత్రం మిస్ అవ్వకూడదని ఈ చిత్ర టీం కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు.

గోవా షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక హైదరబాద్ లో జరిగే ఓ లాంగ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు