నిర్విరామంగా జరగనున్న ఎన్.టి.ఆర్ మూవీ షూట్

నిర్విరామంగా జరగనున్న ఎన్.టి.ఆర్ మూవీ షూట్

Published on Jun 23, 2015 7:12 PM IST

Jr_NTR
ఈ ఏడాది ‘టెంపర్’ సినిమాతో సక్సెస్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వెంటనే సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న తన తదుపరి సినిమాని మొదలు పెట్టలనుకున్నాడు. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ జూలై 1 నుంచి లండన్ లో ప్రారంభం కానుందని ఇది వరకే తెలియజేశాం. అందుకోసమే ఈ చిత్ర టీం జూన్ 28న లండన్ బయలుదేరుతున్నారు. మాకు ఈ చిత్ర సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్ర టీం షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఏ మాత్రం గ్యాప్ లేకుండా నిర్విరామంగా షూట్ చేయనున్నారు.

జూలై 1 నుంచి మొదలయ్యే షెడ్యూల్ ని కంటిన్యూగా సెప్టెంబర్ 15 వరకూ చేయడానికి ప్లాన్ చేసారని సమాచారం. అలాగే 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ షూటింగ్ లో మొదట ఎన్.టి.ఆర్ పై వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తన లుక్ ని మార్చుకొనే పనిలో ఉన్నాడు. టెంపర్ తర్వాత సుకుమార్ సినిమా కోసం ఎన్.టి.ఆర్ మరో స్టైలిష్ లుక్ ని ట్రై చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు