
‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన తరువాతి సినిమా కోసం మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసే సుకుమార్‌తో జత కట్టిన విషయం తెలిసిందే! ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు మొదలవుతుందీ, అప్పుడు మొదలవుతుందీ అన్న ప్రచారం ఎన్నోసార్లు వినిపించగా ఇప్పటికీ సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు.
కాగా తాజాగా ఫస్ట్ షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జూలై మొదటి వారంలో లండన్‌లో ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఇక జూన్ 28నే సినిమా యూనిట్ లండన్‌కు పయనం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో..’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేసే అవకాశం కనిపిస్తోంది.