‘ఆంధ్రావాలా’ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఈనెల 21న లాంచనంగా ప్రారంభం కానుంది. మొదటిసారి పూరి సినిమాకి వక్కంతం వంశీ కథని అందిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించనున్నాడు.
ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఎన్.టి.ఆర్ – కాజల్ అగర్వాల్ – బండ్ల గణేష్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీ ‘బాద్షా’ వచ్చింది. పూరి సినిమాకి ‘రుబాబు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించానున్నాడని సమాచారం. మిగిలిన వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.


