ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా బ్రిటీష్ నేపథ్యంలో అట ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా బ్రిటీష్ నేపథ్యంలో అట ?

Published on Jul 18, 2018 9:45 AM IST


ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండే రకరకాల ఊహా గానాలు వినిపిస్తున్నాయి. ఐతే బాహుబలి లాగే ఈ చిత్రానికి కూడా నేషనల్ వైజ్ గా హైప్ తీసుకురావడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర కథ బ్రిటీష్ కాలం నేపథ్యంలో జరగనుందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న భారీ సెట్ల నిర్మాణాలు అన్ని బ్రిటీష్‌ నేపధ్యానికి, అప్పటి వాతావరణానికి సంబంధించినవని సమాచారం. ఆ సెట్స్ లో వాడే ప్రాపర్టీస్ కూడా అన్ని ఆ కాలం నాటివే నట.

‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్ర షూటింగ్ లో మొదటగా ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఎన్టీఆర్ పై కొంత భాగం చిత్రీకరించిన తర్వాత రామ్ చరణ్ షూట్ లో జాయిన్ అవనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు