ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ రెడీ చేసిన ఎన్.టి.ఆర్

ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్ రెడీ చేసిన ఎన్.టి.ఆర్

Published on Nov 10, 2015 1:22 AM IST

NTR-Nanaku-prematho
మూడవ జెనరేషన్ లో నందమూరి ఫ్యామిలీలో స్టార్డంతో పాటు, స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న యంగ్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఇప్పటి వరకూ 24 సినిమాల్లో నటించిన ఎన్.టి.ఆర్ చేస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ నెల 24 నుంచి ఈ ఫైనల్ షెడ్యూల్ ని స్పెయిన్ లో మొదలు పెట్టనుంది. అలాగే డిసెంబర్ మూడవ వారం కల్లా మొత్తం షూటింగ్ ని పూర్తి చేయనున్నారు.

దసరా కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా, యు ట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజాగా ఎన్.టి.ఆర్ అభిమానులకు మరో దీపావళి గిఫ్ట్ ని ప్లాన్ చేసాడు. దీపావళి కానుకగా నవంబర్ 10వ తేదీ సాయంత్రం 4:30 నిమిషాలకు దీపావళి శుభాకాంక్షలతో కూడిన రెండు ‘నాన్నకు ప్రేమతో’ పోస్టర్స్ ని రిలీజ్ చేయనున్నాడు. ఎన్.టి.ఆర్ అవుట్ అండ్ అవుట్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు